ఐఎఎస్‌ అధికారి చిన వీరభద్రుడికి ఏపీ హైకోర్టు షాక్: 4 వారాల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా


కోర్టు ధిక్కరణకు పాల్పడిన కేసులో ఐఎఎస్ అధికారి చినవీరభద్రుడికి హైకోర్టు నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు రూ. 2 వేల జరిమానాను విధించింది.
 

AP High Court Orders 4 weeks Jail For IAS Officer Chinaveerabhadrudu

అమరావతి:కోర్టు ధిక్కరణ కేసులో ఐఎఎస్ అధికారి Chinaveerabhadruduకి ఏపీ హైకోర్టు 4 వారాల పాటు జైలు శిక్ష విధించింది.  అంతేకాదు రూ. 2 వేలు జరిమానాను విధించింది.2001లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు BPED చదువుకునేందుకు వీలు కల్పిస్తూ AP High Court ఉత్తర్వులు జారీ చేసింది.  బీపీఈడీ చదువుకునే ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీత భత్యాలను చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.అయితే కోర్టు ఉత్తర్వుల అమల్లో జాప్యం చేసింది.

 కోర్టు ఉత్తర్వుల అమల్లో జాప్యం చేసినందుకు గాను చినవీరభద్రుడికి  నాలు వారాల Jail శిక్షను విధిస్తూ మంగళవారం నాడు హైకోర్టు తీర్పును చెప్పింది. అంతేకాదు రూ. 2 వేల జరిమానాను విధించింది. ఈ శిక్షను రెండు వారాలు సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈ రెండు వారాల్లో ఈ తీర్పుపై అప్పీల్ చేసుకోవచ్చని కూడా హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ ఏడాది మార్చి 31న కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఎఎస్ లకు జైలు శిక్ష విధించింది ఏపీ హైకోర్టు అయితే ఈ విషయమై ఏపీ హైకోర్టుకు ఐఎఎస్ లు క్షమాపణ చెప్పడంతో జైలు శిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేయాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. 

విజయ్ కుమార్, గోపాలకృష్ణద్వివేది, శ్యామలారావు, రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎంనాయక్ లపై హైకోర్టు సీరియస్ అయింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దని  ఆదేశాలను హైకోర్టు గతంలో జారీ చేసింది.  అయితే ఈ ఆదేశాలను ఐఎఎస్ లు అమలు చేయలేదు. దీంతో  కోర్టు ధిక్కరణ కింద ఎనిమిది మంది ఐఎఎస్‌లకు  రెండు వారాల పాటు జైలు శిక్షను విధించింది.  

ఈ విషయమై ఐఎఎస్ లు కోర్టును క్షమాపణలు కోరారు. దీంతో  సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఐఎఎస్ లను కోర్టు ఆదేశించింది. జైలు శిక్షకు బదలుగా హాస్టల్ విద్యార్ధులకు సేవ చేయాలని సూచించింది.ప్రతి నెల ఏదో ఒక రోజు  సంక్షేమ హాస్టళ్లలో ఐఎఎస్ లు సేవ చేయాలని సూచించింది. అంతేకాదు ఒక రోజు పాటు కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది.

2021 సెప్టెంబర్ మాసంలో కూడా ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ సహా ఐదుగురు ఐఎఎస్ అధికారులకు కూడా ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు జరిమానాను విధించింది.

గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని కారణంగా కూడా హైకోర్టు ఈ శిక్ష విధించింది.  తాజాగా ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులకు కూడా జైలు శిక్ష విధించింది. అయితే ఐఎఎస్ లు క్షమాపణ కోరడంతో ఉన్నత న్యాయస్థానం సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది. ఐఏఎస్‌ల‌కు విధించిన సామాజిక సేవా శిక్ష‌ను 8 వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేసింది. 

ఈ తీర్పుపై ఇప్ప‌టికే ఇద్ద‌రు ఐఏఎస్‌లు హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించ‌గా.. వారి శిక్ష‌ను వాయిదా వేస్తూ డివిజ‌న్ బెంచ్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో మిగిలిన ఆరుగురు ఐఏఎస్‌లు కూడా హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios