వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్, ఎమ్మెల్సీ అరుణ్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీచేసింది.
వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీచేసింది. నందిగామలో నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని ధాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నందిగామ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని.. ఇందుకు సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేద్దామన్న స్పందించడం లేదని పిటిషనర్ తెలిపారు. ఎమ్మెల్యే జగన్మోహన్, ఎమ్మెల్సీ అరుణ్.. వారి అనుచరులతో కలిసి నిబంధనలకు ఇసుక తవ్వకాలు చేపట్టడం వలన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టు.. వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్, మైనింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌తో మరికొందరికి కూడా నోటీసులు జారీచేసింది.
