Asianet News TeluguAsianet News Telugu

డీబీ ఫ్యాషన్స్‌లో సామాగ్రి చోరీ: ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

సామాగ్రి అపహరణ కేసులో ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్‌పై కొందరు దాడి చేశారు. 

ap high court notice issued to mla maddali giri
Author
Amaravathi, First Published Aug 19, 2020, 6:57 PM IST

సామాగ్రి అపహరణ కేసులో ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్‌పై కొందరు దాడి చేశారు.

ఈ సందర్భంగా తాళాలు పగులగొట్టి రూ.కోటీ యాభై లక్షల విలువ చేసే సామాగ్రిని అపహరించారు. దీనిపై బాధితులు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు... చివరికి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే ఎస్పీ కూడా స్పందించలేదు.

అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో బాధితుడు కొప్పురావూరి శివ ప్రసాద్ చివరికి హైకోర్టును ఆశ్రయించాడు.  ఎమ్మెల్యే మద్దాలి గిరి వత్తిడి కారణంగానే పోలీసులు మౌనం వహిస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తన షాపులో సామాగ్రిని అపహరించిన వారికి ఎమ్మెల్యే మద్దాలి గిరి మద్దతు ఉందని బాధితుడు ఆరోపించాడు. తన షాపును వారు ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని, అందులో భాగంగానే తనను వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఎమ్మెల్యే గిరితో సహా పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios