కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్న భార్య మారుతీ మహాలక్ష్మీ కుమారుడు గోవింద స్వామిని పీఠాధిపతిగా నామినేట్ చేస్తూ వసంత వెంకటేశ్వర స్వామి రాసిన వీలునామాను పరిగణనలోనికి తీసుకోవాలని హైకోర్టు ఇరు వర్గాలకు సూచించింది.

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఠాధిపత్యం కోసం దివంగత పీఠాధిపతి వసంత వెంకటేశ్వర స్వామి కుమారులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పీఠాధిపత్యం కోసం పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్వామి... చిన్న భార్య మారుతీ మహాలక్ష్మీ కుమారుడు మధ్య వివాదం నడుస్తోంది.

తన వీలునామాలో వసంత వెంకటేశ్వర స్వామి రాసిన అంశాల్లో పీఠాధిపతి ఎవరన్న దానిపై సూచనలు వున్నాయి. చిన్న భార్య మారుతీ మహాలక్ష్మీ కుమారుడు గోవింద స్వామిని పీఠాధిపతిగా నామినేట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని హైకోర్టు ఇరు వర్గాలకు సూచించింది. ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకుని పీఠాధిపత్యాన్ని నిర్ణయించాలని ఏపీ హిందూ ధార్మిక పరిషత్‌కు ఏపీ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. 

ALso Read:బ్రహ్మంగారి మఠం కేసులో హైకోర్టు షాక్: ఏపీ ప్రభుత్వ ఆదేశాలు కొట్టివేత

కాగా, తమపై ఒత్తిడి తీసుకొచ్చి బ్రహ్మంగారి పీఠం మఠాధిపతిగా వీరభోగ వెంకటేశ్వరస్వామి మొదటి భార్య తనయుడు వెంకటాద్రి నియామకం జరిగేలా చేశారని వీరభోగవెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ జూన్ 30న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఇటీవల రిజర్వ్ చేసింది. పీఠాధిపతి నియామకం విషయంలో ఏపీ సర్కార్ ఆదేశాలను జూలై 16న కొట్టేసింది.