ఏపీ రాజధానిపై హైకోర్టులో విచారణ: సీజే కీలక వ్యాఖ్యలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై నాలుగో రోజున ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించింది.విచారణ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

AP High court key comments on  AP Capital city

అమరావతి: రాజధానిపై ప్రభుత్వం తీసుకొన్న విధాన పరమైన నిర్ణయాల చట్టబద్దతపై విచారణ నిర్వహిస్తున్నామని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చెప్పారు.పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు రోజువారీ విచారణను నిర్వహిస్తోంది.వరుసగా నాలుగు రోజులుగా ఏపీ హైకోర్టు ఈ పిటిషన్లను విచారణ నిర్వహిస్తోంది. సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, ఉన్నం మురళీధర్  లు రైతుల తరపున వాదనలు విన్పించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు విషయాన్ని ఆనాడు విపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ వ్యతిరేకించలేదని రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదించారు. అమరావతిలో రాజధాని నిర్ణయాన్ని విపక్షంలో ఉన్న సమయంలో వ్యతిరేకించకపోయినా అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

Andhra pradesh రాష్ట్రానికి three capitals అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారని రైతుల తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. శివరామకృఫ్ణకమిటీ నివేదికలో కూడా వివిధ రకాల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేశారని రైతుల తరపు న్యాయవాదులు వాదించారు. అంతేకాదు మెజారిటీ ప్రజలు కూడా amaravati లోనే రాజధాని ఏర్పాటును స్వాగతించారని  ap high court దృష్టికి తీసుకొచ్చారు. ycp ప్రభుత్వం తీసుకొన్న మూడు రాజధానుల నిర్ణయాన్ని మెజారిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రైతుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కూడా రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది. అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని, విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఏర్పాటు చేస్తామని సీఎం అసెంబ్లీలోనే ప్రకటించారు. ఈ మేరకు చట్టాలు కూడ చేశారు. అయితే ఈ చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై నాలుగు రోజులుగా ఏపీ హైకోర్టు రోజువారీ విచారణను ప్రారంభించింది.అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. 45 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. తిరుపతిలో యాత్రను ముగించేలా పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల గుండా ఈ పాదయాత్ర కొనసాగుతుంది.

also read:జగన్ మూడు జన్మలెత్తినా... మూడు రాజధానులు అసాధ్యం: నారా లోకేష్

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రాష్రంలోని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.  మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రియల్ ఏస్టేట్ వ్యాపారుల కోసమే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని టీడీపీ కోరుతుందని వైసీపీ విమర్శలు చేస్తోంది.అమరావతి రాజధాని భూముల విషయంలో చంద్రబాబు సర్కార్ కుంభకోణానికి పాల్పడిందని వైసీపీ సర్కార్ ఆరోపించింది. ఈ విషయమై మంత్రివర్గ ఉప సంఘం ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.మూడు రాజధానుల విషయంలో వైసీపీ సర్కార్ వెనక్కు తగ్గడం లేదు. విపక్షాలు డిమాండ్ ను  జగన్ సర్కార్ తోసిపుచ్చుతుంది. అయితే ఏపీ హైకోర్టు మూడు రాజధానులపై ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందనే విషయమై ఆసక్తి నెలకొంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios