అమరావతి: ఈఎస్ఐ స్కాం తో సబంధాలున్నాయన్న అభియోగాలతో ఆంధ్ర ప్రదేశ్ మాజీ కార్మిక  మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అతడి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సోవారానికి వాయిదా వేసింది.

తమ వాదనలు వినాలని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది కోరినప్పటికి న్యాయస్థానం అంగీకరించలేదు. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై ఒకేసారి వాదనలు వినాలని  ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. 

read more  ఆగని రక్తస్రావం... అచ్చెన్నాయుడికి మళ్లీ ఆపరేషన్ తప్పదన్న డాక్టర్లు

ఈఎస్ఐ లో జరిగిన అవినీతికి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, త‌నకు ఆరోగ్యం బాగోలేద‌ంటూ అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్  పైనే ఇవాళ(శుక్రవారం) విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన అచ్చెన్నాయుడికి బెయిల్ ఇవ్వకుండానే సోమవారానికి వాయిదా వేసింది.