ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. సీఎం వైఎస్ జగన్ సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. సీఎం వైఎస్ జగన్ సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. నీలం సాహ్నిపై రాజకీయపార్టీ ప్రభావం ఉంటుందని వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని ఆయన కోర్టుకి తెలిపారు. మరోవైపు ఈ వ్యాజ్యానికి సంబంధించి ఎస్‌ఈసీ నీలం సాహ్ని కౌంటర్‌ దాఖలు చేశారు. వచ్చే నెల 2 లోపు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం పిటిషనర్‌ను ఆదేశించింది.

నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషనర్ తన పిల్ ను విత్ డ్రా చేసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది గత గురువారం కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఈ పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల క్రితం నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిమీద విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

Also Read:ఎస్ఈసీగా నీలం సాహ్ని : పిటిషన్ ఉపసంహరణ.. !

పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేవారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడం అంటే ఆషామాషీ అయిపోయిందని మండిపడింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థిచండంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో పిటిషన్ దారు తన పిల్ ను ఉపసంహరించుకున్నాడు.