Asianet News TeluguAsianet News Telugu

ఎస్ఈసీగా నీలం సాహ్ని : పిటిషన్ ఉపసంహరణ.. !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషనర్ తన పిల్ ను విత్ డ్రా చేసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది గురువారం కోర్టుకు తెలిపాడు.
 

PIL withdrawn by petitioner over SEC neelam sahni appointment - bsb
Author
Hyderabad, First Published Jun 24, 2021, 1:12 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషనర్ తన పిల్ ను విత్ డ్రా చేసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది గురువారం కోర్టుకు తెలిపాడు.

ఈ క్రమంలో ఈ పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల క్రితం నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిమీద విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేవారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడం అంటే ఆషామాషీ అయిపోయిందని మండిపడింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థిచండంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో పిటిషన్ దారు తన పిల్ ను ఉపసంహరించుకున్నాడు. 

ఎస్ఈసీగా నీలం సాహ్ని: విచారణ జూన్ 29కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు...

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నీలం సాహ్ని నియామకంపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అదనపు వివరాలు ఇవ్వడానికి సమయం కోరాడు పిటిషనర్. దీనిపై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. 

గత బుధవారం కూడా సమగ్ర సమాచారం లేకుండా  'పిల్' వేసిన పిటిషనర్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాష్ట్ర ఎస్ఈసీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ముగ్గురి పేర్లు రాజ్యాంగ విరుద్దమని పిటిషనర్ కోరారు. నీలం సహానీని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా  నియమిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. పూర్తి సమాచారం లేకుండా ఎలా పిల్ వేస్తారని హైకోర్టు పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios