Asianet News TeluguAsianet News Telugu

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్ట్.. ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ ఏడాది మే 21న సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ap high court hearing on parishat elections ksp
Author
Amaravathi, First Published Aug 5, 2021, 4:35 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. పరిషత్‌ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈమేరకు తీర్పును రిజర్వ్‌ చేసింది. 

అంతకుముందు జూన్ 25న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం సవాల్ చేసింది. ఈ సందర్భంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్.

Also Read:ఏపీలో పరిషత్ ఎన్నికలు: సింగిల్ జడ్జి ఉత్తర్వుపై డివిజన్ బెంచ్ స్టే

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ ఏడాది మే 21న సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించ లేదని కోర్టు అభిప్రాయపడింది. పరిషత్ ఎన్నికలను నిర్వహించడాన్ని నిర్వహిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పిటిషన్లు దాఖలు చేశాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios