అమరావతి: రాష్ట్రంలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పుతో రేపు యథాతథంగా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై బుధవారం నాడు మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వెలువరించింది.

ఎన్నికలు నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని ఆదేశించిందిదీంతో రేపు యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై బుధవారం నాడు  ఉదయం ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

 

ఇవాళ ఉదయం విచారణ ప్రారంభం కాగానే ఎస్ఈసీ తరపున  న్యాయవాది సీవీ మోహన్ వాదనలు విన్పించారు.  ఎస్ఈసీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదించారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తరపున న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. ఉదయం పదకొండు గంటలకు ఎస్ఈసీ వాదనలు విన్న హైకోర్టు.. ఆ తర్వాత వర్ల రామయ్య తరపున న్యాయవాది వాదనలను విన్నారు.ఎస్ఈసీ వాదనలపై తొలుత ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన సమాచారం అందించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.