గ్రూప్-1 లో ఇంటర్వ్యూలు: ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
గ్రూప్ 1 ఉద్యోగాల నియామకంలో ఇంటర్వ్యూలకు ఏపీ హైకోర్టు బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని కూడా ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. అభ్యర్ధుల జవాబు పత్రాలు, మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో ఇవ్వాలని కూడా కోర్టు ఏపీపీఎస్‌సీని ఆదేశించింది.
అమరావతి:Group-1 లో Inteviews కొనసాగించేందుకు AP High Court బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫలితాలు మాత్రం కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. అభ్యర్ధుల జవాబు పత్రాలు, మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో ఉంచాలని కూడా హైకోర్టు APPSC ని ఆదేశించింది. తుది ఆదేశాల మేరకు మాత్రమే తుది ఎంపిక ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్ధులకు సమాచారం ఇవ్వాలని కూడా కోర్టు సూచించింది.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యున్నత సర్వీసులైన గ్రూప్–1, 2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఈ ఏడాది మార్చిలో అనుమతించింది.ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ మార్చి 31వ తేదీఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు భర్తీ చేస్తారు. గతంలో ప్రకటించిన జాబ్ క్యాలండర్ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు.
దీంతో గ్రూప్ 1, 2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు.. గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.
గ్రూప్ 2 కు సంబంధించి మొత్తం 182 ఖాళీలకు గాను డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 30, సబ్ రిజిస్టార్ 16, అసిస్టెంట్ రిజిస్టార్, కోఆపరేటివ్ 15, మున్సిపల్ కమిషనర్ 5, ALO(లేబర్) 10, ASO(లా), ASO (GAD), JA (CCS), సీనియర్ అకౌంటెంట్, ట్రెజరీ డిపార్ట్ మెంట్ 10, జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ 20, సీనియర్ ఆడిటర్, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ 5, ఆడిటర్, పే అలవెన్స్ విభాగంలో 10 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వంపేర్కొంది. అయితే గతేడాది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్1, గ్రూప్ 2 మొత్తం ఖాళీలు కేవలం 36 మాత్రమే ఉన్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ కాలెండర్ ను విడుదల చేయనుంది. ఈ జాబ్ కాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది జగన్ సర్కార్. ప్రతి ఏటా కచ్చితంగా ఈ జాబ్ కాలెండర్ ను పాలో అవుతామని కూడా సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే..
also read:అక్టోబర్ 16న తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ
ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను తెలంగాణ ప్రబుత్వం ఎత్తివేసింది. 900 మార్కుల పేపర్లలో మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. తెలంగానలో ఒక్కో పోస్టుకు సుమారు 756కి పైగా పోటీ పడుతున్నారు.ఇంటర్వ్యూలు ఉంటే అక్రమాలు జరిగే అవకాశం ఉందని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూలను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ సర్కార్ గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. 503 పోస్టులను భర్తీ చేయడానికి గాను ఈ ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.