Asianet News TeluguAsianet News Telugu

ఏలూరు కార్పోరేషన్ ఫలితాలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్: కౌంటింగ్‌లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి

ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలకు మార్గం సుగమమైంది. కౌంటింగ్ కి హైకోర్టు శుక్రవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ  కౌంటింగ్ నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

AP High court green signals to  Eluru corporation election  results lns
Author
elurur, First Published May 7, 2021, 10:54 AM IST


ఏలూరు: ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలకు మార్గం సుగమమైంది. కౌంటింగ్ కి హైకోర్టు శుక్రవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ  కౌంటింగ్ నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని ఎన్నికలు వాయిదా వేయాలని  మార్చి 8న దాఖలైన పిటిషన్ పై  ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశించింది.

 

అయితే ఈ విషయమై ఏపీ సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై  ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఎన్నికల ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని ఈ ఏడాది మార్చి 9న ఆదేశించింది.ఏలూరు కార్పోరేషన్ లో 50 డివిజన్లున్నాయి. వీటిలో 3 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకొంది. 47 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  మెజారిటీ స్థానాల్లో  వైసీపీ విజయం సాధించింది. విపక్షాలు నామమాత్రంగానే విజయం సాధించారు. ఏలూరు కార్పోరేషన్ లో ఫలితం ఎలా ఉంటుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios