Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్‌కి షాక్.. అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట, గోడ నిర్మాణానికి అనుమతి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ నిర్మాణానికి సంబంధించి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఇంటికి గోడ నిర్మిచుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. 
 

ap high court gives permission for construction of wall for tdp leader ayyanna patrudu house
Author
Amaravati, First Published Jun 22, 2022, 7:11 PM IST

మాజీ మంత్రి, టీడీపీ (tdp) సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి (ayyanna patrudu) హైకోర్టులో (ap high court) ఊరట లభించింది. డ్రైనేజీ భూమిని ఆక్రమంచి ఇంటి గోడ నిర్మించారని పేర్కొంటూ మున్సిపల్‌ అధికారులు ఆయన ఇంటి గోడను ఇటీవల కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో ఇంటి గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్‌, రాజేష్‌‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   

దీనిపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. ఆమోదం పొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దార్‌, జలవనరులశాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే నిర్మించారని పీవీ సతీష్ తెలిపారు. రాజకీయ కక్షతో.. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు ప్రారంభించారని ఆయన వాదించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇంటి గోడ నిర్మించుకునేందుకు పిటిషనర్లకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ALso Read:కక్షసాధింపే: అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేతపై చంద్రబాబు

ఇదిలా ఉంటే.. ఆదివారం తెల్లవారుజామున అయ్యన్న ఇంటికి వెళ్లిన మున్సిపల్‌ సిబ్బంది.. ప్రహరీని పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయ్యన్నపాత్రుడు తన ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిలో రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని మున్సిపల్ అదికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై నోటీసులు ఇచ్చినా ఆయన నుంచి స్పందన లేదని చెబుతున్నారు. అయ్యన్న స్పందించకపోవడంతోనే ప్రహరీ గోడ కూల్చివేత చేపట్టినట్లు వెల్లడించారు. అయితే కూల్చివేతను అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios