న్యాయవాది సుభాష్ చంద్ర బోస్ భార్య హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నాయిమ్ అస్మి హైకోర్టుకు హాజరయ్యారు. విచారణలో సందర్భంగా అర్థరాత్రి ఏ విధంగా ఇంట్లోకి చొరబడతారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఆధారాలు లేకుండా అర్ధరాత్రి వెళ్లటానికి ఏమన్నా నిబంధనలు ఉన్నాయా అని నిలదీసింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తాము తీసుకోవాల్సిన చర్యలు తాము తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.

పోలీసులు ఉన్నది ప్రజలకు రక్షణ కల్పించడానికన్న విషయం గుర్తుంచుకోవాలని ధర్మాసనం సూచించింది. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలావుతోందా అని ధర్మాసనం ప్రశ్నించింది.

పోలీసులకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉంటే ఖాకీ చొక్కా వదిలి ఖద్దర్ చొక్కా వేసుకోవాలని న్యాయమూర్తి అన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. ఈ కేసును హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.