తప్పుడు సమాచారంతో స్టే: 14 మంది ఇప్పటం వాసులకు జరిమానా విధించిన ఏపీ హైకోర్టు

గుంటూరు  జిల్లాలోని  ఇప్పటంలో   తప్పుడు  సమాచారం ఇచ్చి నందుకు  14 మంది  పిటిషనర్లకు  ఏపీ  హైకోర్టు  ఒక్కొక్కరికి లక్ష  జరిమానాను  విధించింది. 

AP  High  Court  Fined  14 Ippatam Villagers  for  wrong  information  to  Court

అమరావతి: గుంటూరు  జిల్లాలోని  మంగళగిరి  అసెంబ్లీ  నియోజకవర్గం  ఇప్పటంలో అక్రమ  నిర్మాణాల  తొలగింపులో  తప్పుడు  సమాచారం ఇచ్చినందుకుగాను 14  మంది  పిటిషనర్లకు  హైకోర్టు  లక్ష  రూపాయాల చొప్పున  జరిమానాను  విధించింది.ఇప్పటం  గ్రామంలో  ఇళ్ల  అక్రమ  నిర్మాణాల  తొలగింపు  విషయమై  కొందరు  హైకోర్టులో పిటిషన్లను   దాఖలు  చేశారు.  అక్రమ  నిర్మాణాల తొలగింపుపై  అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా  నోటీసులు  ఇవ్వలేదని  కోర్టకు  అబద్దం  చెప్పి  స్టే  తెచ్చుకున్నారు  పిటిషనర్లు.ఈ  విషయం  తెలిసిన  14  మందికి  హైకోర్టు  జరిమానాను  విధించింది. 

ఇప్పటం  గ్రామంలో  ఇళ్ల  అక్రమ  నిర్మాణాల  తొలగింపు  విషయమై  కొందరు  హైకోర్టులో పిటిషన్లను   దాఖలు  చేశారు.  అక్రమ  నిర్మాణాల తొలగింపుపై  అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా  నోటీసులు  ఇవ్వలేదని  కోర్టకు  అబద్దం  చెప్పి  స్టే  తెచ్చుకున్నారు  పిటిషనర్లు.ఈ  విషయం  తెలిసిన  14  మందికి  హైకోర్టు  జరిమానాను  విధించింది. 

ఇప్పటంలో   రోడ్ల  వెడల్పుకు  సంబంధించి  రోడ్డుకు  అడ్డంగా  ఉన్న  అక్రమ  నిర్మాణాల  కూల్చివేతకు  సంబంధించి  మున్సిపల్  కార్పోరేషన్  అధికారులు నోటీసుులు జారీ చేశారు.అయితే  ఈ  నోటీసులు  జారీ చేసినా  కూడా నోటీసులు  ఇవ్వకుండానే  కూల్చివేత ప్రక్రియను  చేపడుతున్నారని   ఇప్పటం గ్రామానికి  చెందిన  14  మంది  హైకోర్టులో  పిటిషన్లు  దాఖలు  చేశారు.  దీంతో  హైకోర్టు  స్టే  విధించింది.  ఈ  విషయమై  మున్సిపల్  కార్పోరేషన్  అధికారులు  హైకోర్టులో  అఫిడవిట్  దాఖలు  చేశారు.  కోర్టును  ఆశ్రయించి  స్టే  పొందినవారికి  కూడా  షోకాజ్ నోటీసులు జారీ  చేసిన విషయాన్ని  అధికారులు  గుర్తు  చేశారు. 

ఈ  విషయం  తెలిసిన  వెంటనే  హైకోర్టు  ఆగ్రహం  వ్యక్తం చేసింది.  అక్రమ  నిర్మాణాల కూల్చివేతపై స్టే  పొందిన  14  మంది  పిటిషనర్లను  కోర్టుకు  హాజరు కావాలని ఆదేశించింది.  తప్పుడు  సమాచారం ఇచ్చి  స్టే  పొందినందుకు  గాను కోర్టు  సీరియస్  అయింది.  ఒక్కో పిటిషనర్ కు  రూ. 1 లక్ష చొప్పున  జరిమానాను విధించింది.  తప్పుడు  సమాచారం ఇచ్చి  కోర్టు  సమయం కూడా  వృధా  చేశారని  కూడా  హైకోర్టు  అసహనం  వ్యక్తం  చేసింది. 

also  read:ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు... పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

తమ పార్టీ  సభకు   స్థలం  ఇచ్చినందుకే  ఇప్పటంలో  ఇళ్లు  కూల్చివేస్తున్నారని  జనసేన ఆరోపించింది. ఇప్పటంలో  ఇళ్ల  కూల్చివేతపై జనసేన చీఫ్ పవన్  కళ్యాణ్  మండిపడ్డారు. ఇళ్లు  కూల్చివేసినట్టుగానే  జగన్  ప్రభుత్వాన్ని  కూల్చివేస్తామని  పవన్ కళ్యాణ్  వార్నింగ్  ఇచ్చారు.  రోడ్ల  వెడల్పు  కార్యక్రమంలో భాగంగానే  ఇళ్ల  కూల్చివేత  ప్రక్రియ సాగుతుందని  వైసీపీ చెబుతుంది. రోడ్లకు  అడ్డంగా  ఉన్న  నిర్మాణాలను  మాత్రమే  కూల్చివేస్తున్నామని  వైసీపీ  తేల్చి  చెప్పిన  విషయం  తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios