ఎంఎల్‌హెచ్ పీ పోస్టుల భర్తీ: స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎల్‌హెరచ్ పీ పోస్టుల భర్తీపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ స్టే విధించింది.
అమరావతి: రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ సూపర్ వైజర్ (ఎంఎల్‌హెచ్‌పీ) భర్తీ ప్రక్రియపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచీ స్టే విధిస్తూ గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య క్లినిక్ లు , ఆరోగ్య వెల్ నెస్ కేంద్రాల్లో 1681 నియామకం కోసం ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.ఈ మేరకు ఈ ఏడాది ఆగష్టు 9న నోటీఫికేషన్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్దంగా ఎంఎల్‌హెచ్‌పీ పోస్టలు నియామకం చేపట్టారని శివకృష్ణ దాఖలుచేసిన పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ నిర్వహించింది.
also read:అర్హత ఉన్న ఆయుష్ డాక్టర్లకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు: జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు ఝలక్
ఎంఎల్ హెచ్ పీ పోస్టుల భర్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీఎస్సీ నర్సింగ్ ను విద్యార్హతగా ప్రకటించిందని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆయుష్ డాక్టర్లకు అవకాశం కల్పించారని పిటిషనర్ ప్రకటించారు. జాతీయ ఆరోగ్య విధానం -2017 విధానాలకు విరుద్దంగా ప్రభుత్వం రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించిందని కూడ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఎంఎల్ హెచ్ పీ పోస్టుల భర్తీపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది.