అమరావతి:  ఈవీఎంల కంటే ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.

ఈవీఎంల కంటే ముందే  వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై మంగళవారం నాడు జస్టిస్ శ్యాం ప్రసాద్ విచారించారు. నాలుగు గంటల పాటు ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి.

ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయమై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే  కౌంటింగ్ ఉంటుందని ఈసీ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఈసీ తరపు న్యాయవాది వాదనతో హైకోర్టు ఏకీభవించింది.