Asianet News TeluguAsianet News Telugu

కోనసీమ అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ పిటిషన్ కొట్టివేత: పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

కోనసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న అల్లర్లపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  పిటిషనర్ కు రూ. 50 లక్షల ఫైన్ వేస్తామని కూడా హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. పిటిషనర్ హైకోర్టుకి క్షమాపణలు చెప్పారు. 

AP High Court dismisses petition filed for hearing with sitting judge on Konaseema riots
Author
Guntur, First Published Jun 24, 2022, 5:20 PM IST

అమరావతి: Konaseema  అల్లర్లపై సిట్టింగ్ జడ్జిJudgeతో విచారణ జరిపించాలని దాఖలు చేసిన Petition ను AP High Court శుక్రవారం నాడు కొట్టివేసింది. పిటిషనర్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.  పిటిషనర్ కు రూ. 50 లక్షలు జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది. అయితే ఇంంటి పిటిషన్లు వేయడం సరైంది కాదని కూడా ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. న్యాయన్థానానికి పిటిషనర్ క్షమాపణలు చెప్పారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన  ప్రసారం చేసింది. 

ఇదిలా ఉంటే కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుగా మార్చుతూ ఏపీ కేబినెట్ ఇవాళ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 

కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లగా పేరు మార్చడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 24న కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి Viswaroop రెండు ఇళ్లకు నిప్పంటించారు. YCP  ఎమ్మెల్యే Satishఇంటికి నిప్పు పెట్టారు. తొలుత ప్రకటించినట్టుగానే కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ ఆందోళనకారులు చేసిన ఆందోళన విధ్వంసానికి దారి తీసింది. 

కోనసీమ జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ తరుణంలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ జిల్లాలో ఎలాంటి  హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ తో పాటు 30 పోలీస్ యాక్ట్ ను కూడా పోలీసులు అమల్లోకి తెచ్చారు. ఇవాళ ఉదయం నుండి కూడా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లా పేరు మార్చారని సంబరాలు చేసుకొంటూ ర్యాలీలకు కానీ, జిల్లా పేరును మార్చారని నిరసనలకు అవకాశం లేదని కూడా పోలీసులు ప్రకటించారు. 

also read:ఇక నుండి అంబేద్కర్ కోనసీమజిల్లా: జిల్లాలో144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు

శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నించే వారిని వదిలే ప్రసక్తే లేదని కూడా పోలీసుతు తేల్చి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కోనసీమ అల్లర్ల కేసులో మరో 18 మందిని ఇటీవలనే అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ఒక మైనర్ కూడా వున్నాడు. వీరితో కలిపి కోనసీమ అల్లర్ల కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 217కి చేరింది. వీరిలో మొత్తం ఆరుగురు మైనర్లు వున్నారు.

ఈ ఘటనల్లో 268 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు 7 బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే మొత్తం 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు పోలీసులు. గతవారం ఈ కేసులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విశ్వరూప్ అనుచరులను A-225గా సత్యరుషి,  A-226గా సుభాష్, A-227గా మురళీకృష్ణ, A-228గా రఘులను చేర్చారు. A-222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios