మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన దాఖలైన మూడు పిటిషన్లపైనా హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికలు ముగిసే వరకు వివేకా హత్యకు సంబంధించి ఎలాంటి ప్రెస్‌మీట్లు పెట్టొద్దని ధర్మాసనం సిట్‌ను ఆదేశించింది.

మరోవైపు వివేకా హత్య కేసును ఏపీ పోలీసులకు బదులుగా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టును కోరారు. సిట్ అధికారుల మీడియా సమావేశాల కారణంగా ఎన్నికల్లో వైసీపీకి నష్టం కలిగేలా ఉందని జగన్ తరపున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.

దీనిపై ఏకీభవించిన న్యాయస్థానం ఎన్నికలు ముగిసే వరకు సిట్ మీడియా ముందుకు రాకూడదని ఆదేశించింది. ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించి మధ్యాహ్నం సిట్ అధికారులు సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదిక అందజేయనున్నారు.