అమరావతి: టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం ఎప్పుడు విడుదల చేస్తారని ఏపీ హైకోర్టు  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.టీటీడీ ఆస్తుల విక్రయంపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. టీటీడీకి ఉన్న ఆస్తులు, దాతలు ఇచ్చిన ఆస్తులపై శ్వేత పత్రం గురించి ధర్మాసనం ప్రస్తావించింది.

 ప్రజలకు ,భక్తులకు, దాతలకు ఈ సమాచారం అవసరమని వ్యాఖ్యానించింది.టీటీడీ ఆస్తుల విషయంలో అఫిడవిట్ ను విడుదల చేస్తామని టీటీడీ ఈఓ ప్రకటించిన విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

దేవాదాయ శాఖ అనుమతి లేకుండానే ఆస్తులను టీటీడీ విక్రయిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.వెంకన్నకు చెందిన స్థిర, చరాస్థులను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. ఈ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని పిటిషనర్ చెప్పారు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు

టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతమౌతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.ఈ హైకోర్టు