Asianet News TeluguAsianet News Telugu

కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక: టీడీపీకి ఊరట.. కేశినేని ఎక్స్‌ అఫిషియో ఓటుకు హైకోర్ట్ ఓకే, డిఫెన్స్‌లో వైసీపీ

ఇటీవల ముగిసిన స్థానిక  సంస్థల ఎన్నికల్లో కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక సంఘం కొత్త ఛైర్మన్‌ పీఠం కోసం పోటీ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్‌ అఫిషియో ఓటును వినియోగించుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ విజయవాడ ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి అనుమతి మంజూరు చేసింది. 

ap high court allows for vijayawada tdp mp kesineni nani ex officio vote casting in kondapalli muncipal chairman election
Author
Amaravati, First Published Nov 19, 2021, 7:11 PM IST

ఇటీవల ముగిసిన స్థానిక  సంస్థల ఎన్నికల్లో (local body elections) కృష్ణా జిల్లా (krishna district) కొండపల్లి పురపాలక సంఘం (kondapalli muncipality) కొత్త ఛైర్మన్‌ పీఠం కోసం పోటీ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్‌ అఫిషియో ఓటును (ex officio vote) వినియోగించుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ విజయవాడ ఎంపీ (vijayawada mp) కేశినేని నాని (kesineni nani)హైకోర్టులో (ap high court)పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఎంపీ కేశినేని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఫలితాలను ప్రకటించవద్దని ఎస్ఈసీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.  

ఈ నెల 17న విడుదలైన ఫలితాలలో 14 టీడీపీ, 14 వైసీపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి టీడీపీలో చేరడం నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయింది. ఇప్పుడు ఛైర్మన్‌ పీఠాన్ని సొంతం చేసుకొనే అంశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి అండతో టీడీపీ ఆ పీఠాన్ని కైవసం చేసుకొంటుందా..? లేక వైసీపీ కొత్త ఎత్తుగడ వేస్తుందా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సమయంలో ఎక్స్‌ అఫీషియా ఓటు తెర పైకి వచ్చింది. ఎక్స్‌ అఫీషియో సభ్యుడి ఓటు కీలకంగా మారడంతో రాజకీయం మరింత వేడెక్కింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొన్న ఇరుపార్టీల పెద్దలు రాత్రికి రాత్రే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. 29 మంది కౌన్సిలర్లను కొండపల్లి నుంచి దూరంగా తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 22న ఛైర్మన్‌ ఎంపిక జరగనున్న నేపథ్యంలో ఆ రోజే అభ్యర్థులంతా కొండపల్లికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కేశినేని ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు హైకోర్టు అనుమతివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Also Read:Ap Municipal Election results 2021:కొండపల్లి కౌంటింగ్ సెంటర్ వద్ద దేవినేని ధర్నా, ఉద్రిక్తత

కొద్దిరోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దర్శి మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీలో (kuppam muncipality) కూడా వైసీపీ గెలుపొందింది. ఏడు దఫాలుగా కుప్పం నుండి చంద్రబాబు విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓటమి పాలైంది. దొంగ ఓట్లతో కుప్పంలో ycp విజయం సాధించిందని tdp ఆరోపించింది. ఈ ఆరోపణలను వైసీపీ ఖండించింది. ఓటమి తర్వాత సాకులను వెతుక్కొనే పనిలో టీడీపీ ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే ఈవీఎంల ట్యాంపరింగ్ అని, ఇప్పుడు  దొంగ ఓట్లపై టీడీపీ నెపం నెడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios