Ap Municipal Election results 2021:కొండపల్లి కౌంటింగ్ సెంటర్ వద్ద దేవినేని ధర్నా, ఉద్రిక్తత
కొండపల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆందోళనకు దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆయన ఆందోళనకు దిగారు. సబ్ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని ఆయన ధర్నా చేశారు.
విజయవాడ: కొండపల్లి మున్సిపల్ కౌంటింగ్ సందర్భంగా అధికారుల తీరును నిరసిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బుధవారం నాడు ధర్నాకు దిగారు. సబ్ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.కొండపల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి దేవినేని తప్పుబట్టారు. ఒకటో నెంబర్ వార్డులో టీడీపీ అభ్యర్ధి విజయం సాధిస్తే వైసీపీ అభ్యర్ధి విజయం సాధించినట్టుగా ఎలా ప్రకటిస్తారని ఆయన మండిపడ్డారు.1వ వార్డు బ్యాలెట్ బాక్సు సీలు అనుమానం కలిగించేదిగా ఉందని ఆయన చెప్పారు.
ఇతర బ్యాలెట్ బాక్సుల సీలు ఒకే రంగులో ఉంటే ఒకటో నెంబర్ బ్యాలెల్ బాక్సు ఉంచిన బాక్సు సీల్ మాత్రం వేరే రంగులో ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై సబ్ కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు మాజీ మంత్రి Devineni Uma Maheswara Rao రెండు గంటలుగా దేవినేని ఉమా మహేశ్వరరావు కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నా చేస్తున్నందున ఉద్రిక్తత చోటు చేసుకొంది. Kondapally మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 14, టీడీపీ 14 స్థానాల్లో విజయం సాధించింది. ఒక్క స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ సభ్యుల బలం 15కి పెరిగింది.
also read:వందకు 97 మార్కులిచ్చారు: ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జగన్
రెండు రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దర్శి మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మున్సిపాలిటీలో కూడా వైసీపీ గెలుపొందింది.ఏడు దఫాలు కుప్పం నుండి చంద్రబాబు విజయం సాధించారు. కానీ కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓటమి పాలైంది. దొంగ ఓట్లతో కుప్పంలో ycp విజయం సాధించిందని tdp ఆరోపించింది. ఈ ఆరోపణలను వైసీపీ ఖండించింది. ఓటమి తర్వాత సాకులను వెతుక్కొనే పనిలో టీడీపీ ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే ఈవీఎంల ట్యాంపరింగ్ అని, ఇప్పుడు దొంగ ఓట్లపై టీడీపీ నెపం నెడుతుందని ఆయన విమర్శించారు.మరోవైపు ప్రజా బలం ఉందని వైసీపీ నేతలకు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పును కోరాలని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే టీడీపీని రద్దు చేసుకొంటామని ఆయన తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే చంద్రబాబుకు ఆయన తనయుడు లోకేష్ లు కొత్త నియోజకవర్గాలను చూసుకోవాలని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుప్పంలో వైసీపీ విజయం సాధించడంతో చంద్రబాబు కూడా మరో నియోజకవర్గాన్ని చూసుకోవాల్సిన పరిస్థితులున్నాయని ఆయన అన్నారు.రాష్ట్రంలోని మున్సిఫల్ ఎన్నికల ఫలితాలు టీడీపీని షాక్ కు గురి చేశాయి. అయితే అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని టీడీపీ ఆరోపించింది. తమ పార్టీకి చెందిన అభ్యర్ధులను నామినేషన్లు కూడా దాఖలు చేయకుండా చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.