తిరుపతి బైపోల్ రద్దు: టీడీపీ, బీజేపీ పిటిషన్లపై విచారణ ఏప్రిల్ 30కి వాయిదా

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని  కోరుతూ  టీడీపీ, బీజేపీ పిటిషన్లను మంగళవారం నాడు  ఏపీ హైకోర్టు విచారించింది. 

AP high court adjourns TDP, BJP petitions on Tirupati bypoll lns

తిరుపతి: తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని  కోరుతూ  టీడీపీ, బీజేపీ పిటిషన్లను మంగళవారం నాడు  ఏపీ హైకోర్టు విచారించింది. తిరుపతి ఎంపీ స్థానానికి ఈ నెల 17న ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ భారీగా దొంగఓట్లు వేసిందని  టీడీపీ, బీజేపీలు ఆరోపించాయి. 

దొంగ ఓట్లతో ఫలితాన్ని తారుమారు చేసేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేసిందని టీడీపీ, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ  టీడీపీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు బీజేపీ కూడ ఇదే విషయమై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ రెండు పిటిషన్లను ఏపీ హైకోర్టు  ఇవాళ విచారించింది.   ఈ విషయమై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు 

 గత ఏడాది తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి, టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ అభ్యర్ధఇగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రత్నప్రభ,  కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ పోటీ చేశారు.  ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు  తమ సర్వశక్తులు ఒడ్డాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios