ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 3కి వాయిదా వేసింది ఏపీ హైకోర్ట్.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 3కి వాయిదా వేసింది ఏపీ హైకోర్ట్. ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు వున్నాయని శ్రీరామ్ వాదించారు. లింగమనేని భూముల పక్కనుంచి రోడ్ వెళ్లేలా అలైన్‌మెంట్ మార్పులు చేశాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలైన్‌మెంట్ మార్పు తర్వాత లింగమనేని భూముల విలువ భారీగా పెరిగిందని.. లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూ అక్రమాలకు పాల్పడ్డాయని శ్రీరామ్ వాదించారు.
లింగమనేని రమేష్ ఇంట్లో ఉన్న చంద్రబాబు హెచ్ఆర్ఏ చెల్లించలేదన్నారు. కానీ ఆ తర్వాత భువనేశ్వరి అకౌంట్ నుండి లింగమనేని రమేష్ కు అద్దె చెల్లించారని ఏజీ ఆరోపించారు. లింగమనేని రమేష్ ఎకరానికి రూ. 10 లక్షలకు భూమి కొనుగోలు చేస్తే మాస్టర్ ప్లాన్ తర్వాత ఎకరం భూమికి రూ. 35 లక్షలకు చేరిందని ఏజీ చెప్పారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో హెరిటేజ్ , లింగమనేని రమేష్ కు లబ్ది చేకూరేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరించిందని ఏజీ వాదించారు.
భువనేశ్వరి అకౌంట్ నుంచి అద్దెను చెల్లించారని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. చంద్రబాబు, భువనేశ్వరికి 91 నోటీసు ఇవ్వొచ్చు కదా అని ఆయన కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.