ఏపీ ఎస్ఈసీ పిటిషన్: విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ధర్మాసనం
: సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మంగళవారంనాడు మధ్యాహ్నానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
అమరావతి: సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మంగళవారంనాడు మధ్యాహ్నానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు సస్పెండ్ చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
also read:స్థానిక ఎన్నికల 'పంచాయితీ': గవర్నర్‌తో నిమ్మగడ్డ రమేష్ భేటీ
ఈ పిటిషన్ పై మంగళవారం నాడు విచారణను ప్రారంభించింది ఏపీ హైకోర్టు ధర్మాసనం. వాదనలు ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే విచారణను వాయిదా వేశారు.ఇవాళ మధ్యహ్నాం తిరిగి విచారణ ప్రారంభం కానుంది.
మరోవైపు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు,తీర్పుపై అప్పీల్ చేసిన విషయాలపై గవర్నర్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.