సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో జగన్ సర్కార్ సవాల్ చేసింది.

అమరావతి:సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఏపీ హైకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యాజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ల ముందుంచాలని ఆయనే నిర్ణయం తీసుకొంటారని ఏపీ హైకోర్టు సూచించింది. ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో బుధవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది హైకోర్టు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:జగన్ సర్కార్‌కి షాక్: జీవో నెంబర్ 35 రద్దు, పాత విధానంలోనే సినిమా టికెట్ల ధరలు

ఇటీవల జరిగిన Assembly సమావేశాల్లో థియేటర్లలో టికెట్ల ను Online లో విక్రయించాలని చట్ట సవరణ చేసింది. నిర్ణయించిన ధరలకే సినిమా Tickets అమ్మాలని బెనిఫిట్స్ షోస్ వేయకూడదని కూడా స్పష్టం చేసింది.టికెట్ ధరలను తగ్గించింది. అయితే టికెట్ల ధరల తగ్గింపుపై సినీ పరిశ్రమలో పలువురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు.కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కోన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. థియేటర్ల యాజామాన్యాల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణ రావు, దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం35ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే సగటు ప్రేక్షకుడికి వినోదం అందించే సినిమా టికెట్ల ధరలను ఇష్టారీతిలో పెంచుకొనే విధానానికి తాము వ్యతిరేకమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. సామాన్యుడికి అందుబాటులో ధరలు తీసుకొచ్చేందుకు వీలుగా సినిమా టికెట్ల ధరలను తగ్గించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగానే సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశామని ప్రభుత్వం తెలిపింది.