Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై భయాలు వద్దు, పుకార్లు నమ్మొద్దు.. అన్ని ఏర్పాట్లు చేశాం: ఆళ్లనాని

ఆంధ్రప్రదేశ్ ప్రజాలెవరూ కరోన వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. వైరస్‌పై ముఖ్యమంత్రి ప్రతీ రోజూ సమీక్షలు జరుపుతున్నారరని ఆయన తెలిపారు. 

ap health minister alla nani press meet over coronavirus
Author
Amaravathi, First Published Mar 3, 2020, 5:00 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రజాలెవరూ కరోన వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. వైరస్‌పై ముఖ్యమంత్రి ప్రతీ రోజూ సమీక్షలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో కరోనా జాడలు బయటపడిన నేపథ్యంలో ఆళ్లనాని మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుక్షణం అప్రమత్తంగా ఉందని, పోర్టుల్లోనూ.. ఎయిర్‌పోర్టుల్లోనూ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.

Aslo Read:కరోనా వైరస్: ప్రతి వందేళ్లకోసారి మానవాళిని వణికిస్తున్న "మహా"మ్మారి వ్యాధి.

రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తగా 8 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని.. తాజాగా కేంద్రం సూచనల మేరకు ప్రత్యేకంగా ఐసోలేషన్ రూములు కూడా ఏర్పాటు చేశామని ఆళ్లనాని వెల్లడించారు.

ఎక్కడికక్కడ మాస్కులు..వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనాపై కొన్ని నిరాధారమైన వార్తలు వస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాని స్పష్టం చేశారు.

ఒకవేళ కరోనా వైరస్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై కేంద్రం ఈ నెల 6న వర్క్‌షాప్ నిర్వహిస్తోందని.. దీని ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

విశాఖ, తిరుపతి, కర్నూలు, కాకినాడ, నెల్లూరు లాంటి చోట్ల ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంచడంతో పాటు ఏఎన్ఎంల ద్వారా కూడా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని మంత్రి చెప్పారు.

Also Read:ఆ ప్రచారం నమ్మొద్దు.. కరోనా వైరస్ ఇలా వ్యాపిస్తుంది: మంత్రి ఈటల

కరోనాకు ఇప్పటి వరకు మందు లేకపోవడంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. 08662410978 కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, కరోనాపై ఎలాంటి అనుమానం వున్నా, ఈ నెంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఆళ్లనాని సూచించారు. కరోనాకు సంబంధించి ప్రతి రోజూ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios