అనంతపురం జిల్లాలో విద్యుత్ వైర్లు మీద పడి ఆరుగురు కూలీలు దుర్మరణం పాలైన ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై ఏడీ, ఏఈ, లైన్ ఇన్స్‌పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

అనంతపురం జిల్లాలో విద్యుత్ వైర్లు మీద పడి ఆరుగురు కూలీలు దుర్మరణం పాలైన ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై ఏడీ, ఏఈ, లైన్ ఇన్స్‌పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే ఈ దారుణంపై నివేదిక సమర్పించాలని విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్‌ను ఆదేశించింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుంటుందని మంత్రి పెద్దిరెద్ది రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 

ALso REad:అనంతపురంలో విషాదం:విద్యుత్ షాక్ తో నలుగురు కూలీలు మృతి

కాగా... రాయదుర్గం తాలూకా బొమ్మనహాల్ మండలం దర్గాహోన్నూరు గ్రామంలో బుధవారం ఓ రైతు పొలంలో మొక్కజొన్న కంకులు కోయడానికి కొందరు కూలీలు వెళ్లారు. కోసిన వాటిని ట్రాక్టర్‌లో లోడ్ చేస్తుండగా.. విద్యుత్ తీగ ట్రాక్టర్‌పై పడింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్ధితి విషమంగా వుంది. అధికారుల నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.