Asianet News TeluguAsianet News Telugu

ANDHRA PRADESH: ఉద్యోగులకు ఏపీ సర్కారు షాక్ !.. కొత్త వేత‌న స‌వ‌ర‌ణ ఉత్త‌ర్వులు జారీ..

ANDHRA PRADESH: ముఖ్య‌మంత్రి వైస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా స‌ర్కారు.. ఏపీ ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చింది. కొత్త వేత‌న స‌వ‌ర‌ణ ఉత్తర్వులు వ‌రుస పెట్టి జారీ చేసిన ప్ర‌భుత్వం.. ఇంటి అద్దె విష‌యంలో ఉద్యోగుల‌కు నిరాశే ఎదురైంది. అలాగే, ఇప్ప‌టి నుంచి ప‌దేండ్ల‌కు ఒక‌సారే వేత‌న స‌వ‌ర‌ణ‌లు చేయ‌నున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.  ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లోఅసంతృప్తి వ్యక్తమవుతున్నది. 

Ap Govt shocks employees!
Author
Hyderabad, First Published Jan 18, 2022, 5:37 AM IST

ANDHRA PRADESH: ముఖ్య‌మంత్రి వైస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి (Y S Jagan Mohan Reddy) నేతృత్వంలోని వైకాపా స‌ర్కారు.. ఏపీ ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చింది. కొత్త వేత‌న స‌వ‌ర‌ణ ఉత్తర్వులు వ‌రుస పెట్టి జారీ చేసిన ప్ర‌భుత్వం.. ఇంటి అద్దె విష‌యంలో ఉద్యోగుల‌కు నిరాశే ఎదురైంది. అలాగే, ఇప్ప‌టి నుంచి ప‌దేండ్ల‌కు ఒక‌సారే వేత‌న స‌వ‌ర‌ణ‌లు చేయ‌నున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. సోమవారం రాత్రి కొత్త వేతన సవరణ ఉత్తర్వులను వరుసగా జారీ చేసింది వైక‌పా ప్ర‌భుత్వం.  ఈ క్ర‌మంలో అశుతోష్‌ మిశ్ర కమిటీ సిఫార్సులనూ పరిగణనలోకి తీసుకోకుండా సీఎస్‌ కమిటీ సూచనల మేరకే ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఇంటి అద్దె భత్యంలో కోత విధించింది.

 019 జులై నుంచి 2021 డిసెంబర్ 31 వరకు అన్ని రకాల డీఏ (Dearness Allowance) లను విడుదల చేసింది. మధ్యంతర భృతి (interim relief-IR) విషయంలోనూ ప్రభుత్వం షాకిచ్చింది. అప్పటి నుంచి ఫిట్‌మెంట్‌ 23శాతాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. దీనివల్ల అదనంగా ఇచ్చిన 4% విలువకు సమాన మొత్తాన్ని బకాయిల నుంచి మినహాయించుకోనుంది. పెండింగులో ఉన్న 5 డీఏలు ఇవ్వాలని నిర్ణయించింది. 18 నెలల బకాయిలు ఇవ్వ‌నుంది. అలాగే,  సీసీఏ  (City Compensatory Allowance-CCA) రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్ప‌టి నుంచి ప‌ది సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మాత్ర‌మే వేత‌న స‌వ‌ర‌ణ‌లు చేస్తామ‌ని ఉత్త‌ర్వుల్లో స్పష్టం చేసింది స‌ర్కారు. దీంతో పాటు 2019 జులై 1 నుంచి  2021 ఏడాది చివ‌రి వరకు ఉద్యోగులకు, పింఛనర్లకు ఇవ్వాల్సిన 5 పెండింగు డీఏల అమలుకూ  కూడా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.  దీని ప్ర‌కారం 80 సంవ‌త్స‌రాలు వ‌చ్చిన  తర్వాతే వారికి అదనపు పింఛను లభిస్తుంది.

ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన పీఆర్సీ (Pay Revision Commission-PRC)ఉత్తర్వుల్లోని ప‌లు ముఖ్య‌మైన విష‌యాలు ఇలా ఉన్నాయి.. 022 సవరించిన పే స్కేళ్లు నిర్ణయించే క్రమంలో మధ్యంతర భృతిని పరిగణనలోకి తీసుకోరు. సవరించిన మాస్టర్‌ స్కేలులో 32 గ్రేడులు ఉంటాయి. 2018 జులై 1 నుంచి నోషనల్‌గా కొత్త పీఆర్సీ అమలవుతుంది. 2022 జనవరి నుంచి కొత్త జీతాల్లో పీఆర్సీ అమలు ప్రభావం క‌నిపిస్తుంది. సచివాలయ ఉద్యోగులతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఉద్యోగులకు 16 శాతం అద్దె భత్యం, మిగిలిన ఉద్యోగులంద‌రికీ  అందరికీ 8 శాతం అద్దెభత్యం రానుంది. గ్రాట్యుటీ పరిమితి రూ.16 లక్షలకు పెంపు పెరిగింది. ఆటోమేటిక్‌ అడ్వాన్సుమెంట్‌ స్కీం 6, 12, 18, 24తో 30గా కొనసాగుతుంది. 

2004 తర్వాత నియమితులైన సీపీఎస్‌ (Contributory Pension Scheme-CPS) ఉద్యోగులకు మధ్యంతర భృతి (interim relief-IR) సర్దుబాటు చేసిన తర్వాత చెల్లించాల్సిన బకాయిలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో నాలుగు సమాన త్రైమాసిక వాయిదాల్లో చెల్లించ‌నున్నారు. అలాగే, 2004కు ముందు ఓపీఎస్‌ విధానంలో ఉన్న ఉద్యోగులకు మధ్యంతర భృతిని సర్దుబాటు చేసిన తర్వాత బకాయిలను నాలుగు త్రైమాసికాల్లో ఉద్యోగుల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాల్లో జమచేస్తారు. కాగా, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌పై ఉద్యోగులు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ అమలు కారణంగా తమకు వేతనాలు పెరగక‌పోవ‌డానికి బ‌దులు త‌గ్గిపోతున్న‌ద‌ని పేర్కొంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios