ఏపీలో ప్రైవేట్  కాలేజీల్లో చదివే పీజీ విద్యార్ధులకు ప్రభుత్వం షాకిచ్చింది. 2020-2021 నుంచి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వర్తించదని సర్కార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

యూనివర్సీటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీల విద్యార్ధులకు మాత్రమే పథకాలు వర్తిస్తాయని తెలిపింది. ఏపీసీఎఫ్‌ఎస్ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

దీనిపై విద్యార్ధులు భగ్గుమన్నారు. ప్రైవేట్ పీజీ కాలేజీల్లో విద్యార్ధులకూ అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఏపీ వ్యాప్తంగా సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో 158 కాలేజీలు నడుస్తున్నాయి.