Chittoor: పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఇంధన శాఖ మంత్రి పీ.రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పుంగనూరు మండలం మాగుండ్లపల్లి గ్రామంలో సచివలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. 

Andhra Pradesh Energy Minister P Ramachandra Reddy: అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు కార్పొరేట్‌ హోదా కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని ఇంధన శాఖ మంత్రి పీ.రామచంద్రారెడ్డి తెలిపారు. నాడు-నేడు పథకం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే ఏపీ ప్రభుత్వం లక్ష్యమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఇంధన శాఖ మంత్రి పీ.రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పుంగనూరు మండలం మాగుండ్లపల్లి గ్రామంలో సచివలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి పేద విద్యార్థులందరికీ ఉజ్వల భవిష్యత్తును అందించడమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని పునరుద్ఘాటించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించ‌డం అత్యంత వినూత్నమైన ఆలోచన అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఇలాంటి ప‌థ‌కాల‌ను అనుసరించలేదని తెలిపారు. చిత్తూరు సహకార డెయిరీని పునఃప్రారంభించడం సీఎం విప్లవాత్మక నిర్ణ‌య‌మ‌ని తెలిపారు. ఈ విషయంలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నిరాధారమైన ప్రకటనలు చేస్తోందని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ జి శ్రీనివాసులు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పి ద్వారకానాథ్ రెడ్డి, జెడ్పీ సిఇఓ ఎన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.