విశాఖపట్నం ఆర్. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా విడుదల చేసింది. రూ. 30 కోట్లు విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.కోటి రూపాయలు ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రథమ చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, ఆసుపత్రిలో రెండు, మూడు రోజులు ఉన్నవారికి లక్ష, వెంటి లెటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

Also Read:విశాఖ దుర్ఘటనపై సర్కార్ చర్యలు... ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు

గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని జగన్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 12కు చేరింది. ఈ దుర్ఘటనను జగన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని సభ్యుల పేర్లను వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:ఇంకా ఎన్ని ఉన్నాయో గుర్తించండి: గ్యాస్ దుర్ఘటనపై రివ్యూ భేటీలో జగన్

ఇందులో పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్, కరికాల వలనన్, కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ సీపీ ఆర్కే మీనా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్‌లను నియమించింది. త్వరితగతిన విచారణను పూర్తి చేసి నివేదికను సమర్పించాల్సిందిగా ప్రభుత్వం కమిటీకి సూచించింది.