సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఫించన్లు, ఇతర పథకాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డ్ అప్‌డేట్ హిస్టరీని కూడా తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది. ఫించన్లు పొందేందుకు పుట్టిన తేదీలు మార్చుకుంటున్నారని తేలడంతో జగన్ ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది.