Asianet News TeluguAsianet News Telugu

జల విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వండి: కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ లేఖ

కృష్ణా బేసిన్‌లో నీటి ప్రవాహం పెరుగుతోందని.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 870 అడుగులకు చేరిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో శ్రీశైలం కుడిగట్టులో జలవిద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కేఆర్‌ఎంబీని కోరింది.
 

ap govt letter to krmb for hydro power generation in srisailam plant ksp
Author
Amaravathi, First Published Jul 25, 2021, 5:09 PM IST

కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఏపీ జలవనరుల శాఖ ఆదివారం లేఖ రాసింది. శ్రీశైలం కుడిగట్టులో జలవిద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌లో నీటి ప్రవాహం పెరుగుతోందని.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 870 అడుగులకు చేరిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం జల విద్యుత్‌కు అనుమతి ఇవ్వాలని కేఆర్ఎంబీని ఏపీ ప్రభుత్వం కోరింది. 

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. ప్రస్తుతం జలాశయానికి 4,05,416 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం నీటిమట్టం 863.7 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ప్రస్తుతం వంద టీసీఎంలకు పైగా నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios