ప్ర‌భుత్వ ఉద్యోగుల హ‌జ‌రుపై (employee attendance) ఏపీ స‌ర్కార్ (ap govt) దృష్టి పెట్టింది. స‌చివాల‌యంలో ఉద్యోగులంద‌రికి బ‌యోమెట్రిక్ హ‌జ‌రును త‌ప్ప‌ని స‌రిచేసింది. ఇప్ప‌టికే బ‌యోమెట్రిక్ (biometric) హ‌జ‌రుపై సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ మెమో జారీ చేసింది. 

ప్ర‌భుత్వ ఉద్యోగుల హ‌జ‌రుపై (employee attendance) ఏపీ స‌ర్కార్ (ap govt) దృష్టి పెట్టింది. స‌చివాల‌యంలో ఉద్యోగులంద‌రికి బ‌యోమెట్రిక్ హ‌జ‌రును త‌ప్ప‌ని స‌రిచేసింది. ఇప్ప‌టికే బ‌యోమెట్రిక్ (biometric) హ‌జ‌రుపై సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ మెమో జారీ చేసింది. మ‌రోసారి తాజాగా ఉద్యోగుల బ‌యోమెట్రిక్ హ‌జ‌రుపై జీఎడీ మెమో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ‌ ప్రభుత్వ విభాగాలు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల‌ హాజరు వివరాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. 

బయోమెట్రిక్ ద్వారా నమోదైన ఉద్యోగుల హాజరును ఎప్పటికప్పుడు గమనించాలని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్ర‌భుత్వం ఆదేశాల్లో తెలిపింది. ఏపీ సచివాలయంలోని ఉద్యోగుల హాజరు నమోదు వివరాలు రోజువారీగా సంబంధిత శాఖ కార్యదర్శి పరిశీలించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో సూచించింది. ఏపీ సచివాలయంలో 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు గుర్తించినట్టు ప్ర‌భుత్వం పేర్కొంది.

ALso Read:సచివాలయ ఉద్యోగులకు జగన్ దసరా కానుక.. ఆ సదుపాయం కల్పించేందుకు అంగీకారం

సచివాలయంలోని అన్ని విభాగాల్లోనూ 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించింది. ఈ అంశంపై గతంలో జారీ చేసిన నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్ఫ‌ష్టం చేసింది. ఉద్యోగ విరమణ చేసిన, బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించిన వివరాలను బయోమెట్రిక్ నుంచి తొలగించాలని ఆదేశించింది. బయోమెట్రిక్ హాజరు నమోదు నెలవారీగా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని సూచించింది.

కాగా.. సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి (free accommodation) సౌకర్యం పునరుద్ధరణకు ఇటీవల సీఎం వైఎస్ జగన్ (ys jagan) అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ఉచిత వసతిని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని సీఎం జగన్‌ను ఏపీ సచివాలయ ఉద్యోగుల కోరింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సచివాలయ సంఘం విజ్ఞప్తిని అంగీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతిని కొనసాగిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను జగన్ ఆదేశించారు. ఉద్యోగులకు ఉచిత వసతిని ఎత్తేస్తూ గతంలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.