అమరావతి: రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ సభ్యుల ఎంపిక కోసం సెలెక్షన్‌ కమిటీ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి సభ్యులుగా పురపాలక శాఖ, న్యాయశాఖల కార్యదర్శులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.