Asianet News TeluguAsianet News Telugu

ఆక్సిజన్‌పై ఏపీ సర్కార్ ఫోకస్.. ప్లాంట్ల నిర్మాణానికి భారీగా నిధులు, ప్రత్యేకాధికారి నియామకం

కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్‌ ఉత్పత్తికి సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ల ఏర్పాటుకు ​ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.309.87 కోట్లను ఇందుకోసం కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ap govt has allocated huge funds setting oxygen production plants ksp
Author
Amaravathi, First Published May 9, 2021, 3:12 PM IST

కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్‌ ఉత్పత్తికి సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ల ఏర్పాటుకు ​ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.309.87 కోట్లను ఇందుకోసం కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

49 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. 10 వేల అదనపు ఆక్సిజన్‌ పైప్‌లైన్ల ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలల కాలానికి గాను రూ.60 లక్షలు మంజూరు చేసింది.

Also Read:అత్యవసర ప్రయాణాలకు ఈ-పాస్... హద్దు మీరితే వాహనాలు జప్తే: ఏపీ డీజీపీ సవాంగ్

అలాగే కోవిడ్‌ వైద్యానికి ఆక్సిజన్‌ సరఫరా కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షించనున్నారు. అలాగే లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరాపై  కరికాల వలవన్‌ దృష్టి సారించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios