ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌పై వైఎస్ జగన్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో విడి విడిగా సమావేశమవ్వనున్నారు. ఇవాళ, రేపు ఆయన పలు శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చిస్తారు. సోమవారం 12 శాఖలపై విడివిడిగా చర్చలు జరపనున్నారు.

ఈ సమావేశానికి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పేర్నినాని, కన్నబాబు, మోపిదేవి వెంకట రమణ, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, తానేటి వనిత, ఆళ్లనాని, జయరాం, విశ్వరూప్, పుష్ప శ్రీవాణి, శ్రీరంగనాథరాజు హాజరుకానున్నారు.