ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా జూలై 1 నుంచి కొత్త పే స్కేల్ కిందకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రానున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా జూలై 1 నుంచి కొత్త పే స్కేల్ కిందకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రానున్నారు. ఈ మేరకు ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంబంధించి ఫైలుపై సీఎం వైఎస్ జగన్ గురువారం సంతకం చేశారు. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో జారీ కానుంది. ఆగస్టు 1 నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారు సచివాలయ ఉద్యోగులు.
