ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. మరోవైపు ఎస్ఈసీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం మంగళవారం తెలిపింది.

షెడ్యూల్ రద్దుకు సంబంధించి అత్యవసర విచారణ అవసరం లేదని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. రెగ్యులర్ కోర్టులో విచారణ చేద్దామని హైకోర్టు తెలిపింది. అయితే అత్యవసర విచారణ చేయాల్సిన అవసరం వుందని ఎస్ఈసీ కోర్టుకు తెలిపారు.

Also Read:4 వేల మెయిల్స్ వచ్చాయి: ఎస్ఈసీ పిటిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

ఇప్పటికే ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో వుందని ఎన్నికల సంఘం విన్నవించింది. స్టే కారణంగా ఎన్నికల ప్రక్రియ మరింత జాపయం అవుతుందని ఎస్ఈసీ పేర్కొంది. ఎన్నికల కమీషన్‌కు ఇప్పటికే 4 వేల మొయిల్స్ వచ్చాయని వెల్లడించింది.

అలాగే ఎలక్ట్రోరల్ లిస్ట్ తయారీ కూడా ఆగిపోతుందని ఎస్ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే డివిజన్ బెంచ్ స్టే ఎత్తివేస్తే ఎన్నికల నిర్వహణలో జాప్యం చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇరు వర్గాల వాదనలను విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. కాగా ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.