Asianet News TeluguAsianet News Telugu

ఖబడ్దార్, దమ్ముంటే చూస్కో .. తోటి నేతతో ఇలాగేనా : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత ఆస్కార్ రావు

సూర్యనారాయణ ఖబడ్దార్, ఆస్కార్ రావు కాస్కో, దమ్ముంటే చూస్కో అంటారా అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత ఆస్కార్ రావు. గవర్నర్ ఏమైనా దేశ ద్రోహా.. గవర్నర్ దగ్గరకి వెళ్లడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. 

ap govt employees union leader oscar rao fires on apngo leaders
Author
First Published Jan 20, 2023, 3:17 PM IST

అడ్డూ అదుపు లేకుండా ఏపీ ఎన్జీవో సంఘం నడుస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత ఆస్కార్ రావు మండిపడ్డారు. రాజకీయాలకు తొలిమెట్టు అన్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం మారిందని ఆయన ఆరోపించారు. ఏపీ ఎన్జీవో సంఘంలో కేవలం నాన్ గెజిటెడ్ స్థాయివాళ్లే వుంటారని ఆస్కార్ రావు అన్నారు. మా సంఘంలో అటెండర్ నుంచి అధికారుల వరకు వున్నారని ఆయన తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం నుంచి సగం మంది ఉద్యోగులు మా సంఘంలో చేరారని ఆస్కార్ రావు పేర్కొన్నారు. గవర్నర్ ఏమైనా దేశ ద్రోహా.. గవర్నర్ దగ్గరకి వెళ్లడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. సూర్యనారాయణ ఖబడ్దార్, ఆస్కార్ రావు కాస్కో, దమ్ముంటే చూస్కో అంటారా అంటూ ఫైర్ అయ్యారు. తోటి సంఘం నేతను ఖబడ్దార్ అంటారా అంటూ దుయ్యబట్టారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఎన్జీవో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గురువారం ప్రభుత్వ ఉద్యోగం సంఘం, ఇతర ఉద్యోగులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడం కలకం రేపింది. దీనిని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఖండించారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసే అధికారం ప్రభుత్వ ఉద్యోగులకు లేదన్నారు. నియమ నిబంధనలు పాటించని పక్షంలో గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి వుందన్నారు. సూర్య నారాయణ వెనుక ఎవరున్నారో, ఏ శక్తి ఆయనను నడిపిస్తుందో ఉద్యోగులు గమనిస్తున్నారని బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ఇప్పటి వరకు ఓపికపట్టామని, ఇకనైనా ఇలాగే వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. 

Also REad: ఏపీఎన్జీవో వర్సెస్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు : బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలకు సూర్యనారాయణ కౌంటర్

అంతకుముందు వేతన బకాయిలపై  ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు  గురువారం నాడు ఏపీ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు  చేశారు. ఎనిమిది ఉద్యోగ సంఘాల నేతలు  ఏపీ గవర్నర్ తో  భేటీ అయ్యారు.జీపీఎఫ్,  మెడికల్ బిల్లులు , డీఏలు, రిటైర్మెంట్  బెనిఫిట్స్ బకాయిల చెల్లింపులో  జోక్యం చేసుకోవాలని  గవర్నర్ ను ఉద్యోగ సంఘాల నేతలు  కోరారు. ఈ మేరకు  గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.

ఉద్యోగులకు  రావాల్సిన  ఆర్ధిక ప్రయోజనాలు  స్థంభించాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. తమ ను రక్షించాలని గవర్నర్ కు మొరపెట్టుకున్నామని  ఆయన  చెప్పారు. ఉద్యోగులకు  న్యాయబద్దంగా చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని  ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.  ఉద్యోగులకు  బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వమే చట్టాలను అతిక్రమిస్తుందని  ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios