Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్‌ల అప్పగింత.. కానీ ఒక షరతు

గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా ఏపీలోని ప్రాజెక్ట్‌లను బోర్డులకు అప్పగించేందుకు ఏపీ  ప్రభుత్వం (ap govt) సిద్ధమైంది. నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూల్ ప్రకారం.. శ్రీశ్రైలం (srisailam) ప్రాజెక్ట్ స్పిల్ వే, రివర్ స్నూయిజ్‌తో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (pothireddypadu), హంద్రీనీవా (handri neeva) , మచ్చుమర్రి (machhimarri) ఎత్తిపోతల పథకాలను అప్పగించేందుకు సిద్థమని  ప్రకటించింది

ap govt decides to implement gazette notification on krishna projects
Author
Amaravati, First Published Oct 14, 2021, 6:44 PM IST

గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా ఏపీలోని ప్రాజెక్ట్‌లను బోర్డులకు అప్పగించేందుకు ఏపీ  ప్రభుత్వం (ap govt) సిద్ధమైంది. నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూల్ ప్రకారం.. శ్రీశ్రైలం (srisailam) ప్రాజెక్ట్ స్పిల్ వే, రివర్ స్నూయిజ్‌తో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (pothireddypadu), హంద్రీనీవా (handri neeva) , మచ్చుమర్రి (machhimarri) ఎత్తిపోతల పథకాలను అప్పగించేందుకు సిద్థమని  ప్రకటించింది. అయితే తెలంగాణ  కూడా ప్రాజెక్ట్‌లను అప్పగిస్తేనే తాము కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తామని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. కార్యాలయాలు, మెషినరీ, ఎక్విప్‌మెంట్ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. 

శ్రీశైలం ఎగువన వున్న జూరాల ప్రాజెక్ట్‌పై కూడా నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీని ఏపీ ప్రభుత్వం కోరింది. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వచ్చే ప్రవాహాలను ప్రభావితం చేసే ప్రాజెక్ట్‌గా జూరాలను కూడా కేఆర్ఎంబీ తన స్వాధీనంలోకి తీసుకోవాలని ఏపీ సర్కార్ కోరింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలూ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాత వాటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేసింది. 

కాగా, కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులతో (nagarjuna sagar) పాటు వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాలకు బోర్డుకు అప్పగించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా కేఆర్ఎంబీ ఛైర్మెన్  ఎంపి సింగ్ అక్టోబర్ 12న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14 నుండి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానుందని కేఆర్ఎంబీ ఛైర్మెన్ mp singh ప్రకటించారు.దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అన్ని డైరెక్టు అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి రానున్నాయి. అవుట్‌లెట్ల అప్పగింతకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్ఎంబీ కోరింది.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలు నేపథ్యంలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. మంగళవారం నాడు హైద్రాబాద్ జల సౌధలో  krmb సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ALso Read:కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్: 16 ఔట్‌లెట్లకు ఓకే, కానీ...ఏపీ, తెలంగాణ వాదనలివీ...

కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గతంలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14 నుండి ఈ నోటిఫికేషన్లను అమలు చేయాలి.  ఈ విషయమై ప్రధానంగా చర్చించారు. అయితే  నీటి కేటాయింపులు లేకుండానే ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తికి అనుమతివ్వాలని ఏపీ అడుగుతుందన్నారు. ఈ నెల 14 లోపుగా స్పష్టమైన నిర్ణయాలు వెల్లడిస్తామన్నారు. ఈ విషయమై కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి  త్వరలోనే చెబుతామని రజత్ కుమార్ వివరించారు.విద్యుత్ ఉత్పత్తిపై అధికారం ఇవ్వాలని కోరామన్నారు. ప్రోటోకాల్ ప్రకారంగా అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని చెప్పామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios