Asianet News TeluguAsianet News Telugu

అదుపులోకి కరోనా.. ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు యథాతదం, ఏపీ సర్కార్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం సచివాలయం సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కార్యాలయాలు, సచివాలయం, విభాగాధిపతులు, కార్పోరేషన్ల కార్యాలయాలు పనిచేస్తాయని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ap govt changed govt office working timings ksp
Author
Amaravathi, First Published Jul 20, 2021, 6:32 PM IST

కరోనా వల్ల మార్చిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను ఏపీ ప్రభుత్వం పునరుద్దరించింది. కోవిడ్ ప్రభావం తగ్గడంతో పనివేళలు పునరుద్ధరిస్తూ సీఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కార్యాలయాలు, సచివాలయం, విభాగాధిపతులు, కార్పోరేషన్ల కార్యాలయాలు పనిచేస్తాయని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం సెలవు వుంటుందని వెల్లడించారు. సచివాలయం, విభాధిపతులు, కార్పోరేషన్ల కార్యాలయాలకు మాత్రం వారానికి రెండ్రోజులు సెలవు వుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యాలయాలు మరో ఏడాది పాటు వారానికి 5 రోజులే పనిచేస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

Also Read:ఏపీ: 24 గంటల్లో కొత్తగా 2,498 కరోనా కేసులు.. గోదావరి జిల్లాల్లో తీవ్రత

అంతకుముందు కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వుండాలని... మరోసారి సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలని సీఎం ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios