ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల దాడుల అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించింది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ పని చేయనుంది. ప్రస్తుతం ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అశోక్ కుమార్. సిట్‌లో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు.

వీరిలో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్, ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ శ్రీధర్, సీఐడీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, మరో 12 మంది పోలీస్ అధికారులు వున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆలయాల దాడులపై ఆ బృందం దర్యాప్తు చేయనుంది.