ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణాధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణాధికారిగా కమీషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాను నియమించింది

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణాధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణాధికారిగా కమీషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాను నియమించింది. అఖిల భారత సర్వీసు క్రమశిక్షణా నిబంధనల్లోని సెక్షన్ 8 కింద ఏబీవీపై అభియోగాలున్నాయి. ప్రభుత్వం తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్‌ను నియమిస్తూ ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం తరపున వాదించేందుకు అడ్వకేట్‌ను నియమిస్తూ ఆదేశాలిచ్చారు. అభియోగాలకు సంబంధించిన వివరణను నిర్ణీత సమయంలోగా సమర్పించాలని ఏబీ వెంకటేశ్వరరావును ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. 

Also Read:పోలీస్ శాఖపై ఆరోపణలు: ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలకు సిద్ధమైన ఏపీ సర్కార్