ప్రభుత్వంలో ఏపీఎస్‌ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి ఏపీ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సభ్యులుగా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్టీసీ ఎండీలు ఉంటారు. విలీన విధి విధానాలకు సంబంధించి ఆంజనేయరెడ్డి కమిటీ రూపొందించనుంది. విలీన ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులు.. వాటి పరిష్కారంపై కమిటీ అధ్యయనం చేస్తుంది.

మంత్రి పేర్ని నానితో కమిటీతో సభ్యులు టచ్‌లో ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సుల ప్రవేశంపైనా కమిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది. అలాగే మొత్తం ప్రక్రియపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.