గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.

దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో తొలి గ్రామ సచివాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

గ్రామీణుల ముంగిటకే సేవలు అందించి అవినీతి, దళారుల ప్రమేయం అరికట్టి సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందజేయాలన్నదే గ్రామ సచివాలయాల ముఖ్యోద్దేశం.