జీపీఎస్, సీపీఎస్ వివాదం నేపథ్యంలో మంగళవారం ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా 16 ఉద్యోగ సంఘాల నేతలు తమ వాదనలను మంత్రుల కమిటీ ముందుకు తీసుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (joint staff committee) , జీవోఎంల (gom) సమావేశం ముగిసింది. మంత్రి బొత్స సత్యనారాయణ (joint staff committee), ఆదిమూలపు సురేష్ (audimulapu suresh), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy), ఉద్యోగ సంఘాల నేతలు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ సమావేశంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని పదహారు ఉద్యోగ సంఘాల నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. జీపీఎస్ ప్రతిపాదనపై చర్చిద్దామని .. ప్రభుత్వం సూచించగా పాత పెన్షన్ విధానంపైనే చర్చించాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. సచివాలయ ఉద్యోగుల నిరసనలను ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. 

ALso Read:సీపీఎస్ రద్దుకై ఉద్యోగ సంఘాల డిమాండ్: నేడు కేబినెట్ సబ్ కమిటీతో భేటీ

ఇదిలావుండగా పాత పెన్షన్ విధానం (old pension scheme)సాధ్యం కాదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జీపీఎస్‌లో (gps) సవరణలకు సిద్ధంగా వున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు మంచి చేయాలనే జీపీఎస్ ఆలోచన చేశామని.. సీపీఎస్‌లో (cps) పెన్షన్‌కు భరోసా ఉండదని సజ్జల తెలిపారు. అందుకే 33 శాతం గ్యారెంటీతో జీపీఎస్ ప్రతిపాదన చేశామని.. రాజస్ధాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏ రాజకీయ కారణాలతో నిర్ణయం తీసుకున్నాయో తెలియదని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 

కాగా.. Chandrababu Naidu ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపక్షనేతగా ఉన్న YS Jagan సీపీఎస్ ను రద్దు చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఈ హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 25న కేబినెట్ సబ్ కమిటీతో ఏపీలోని ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో సీపీఎస్ రద్దు చేసి జీపీఎస్ ను తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జీపీఎస్ కు తాము వ్యతిరేకమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. ఈ తరుణంలో ఇవాళ మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు.