తెలంగాణ రాష్ట్రంలోని  విద్యుత్ సంస్థలకు నీటి విడుదలను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి  ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కేఆర్ఎంబీ కూడ స్పందించింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు నీటి విడుదలను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కేఆర్ఎంబీ కూడ స్పందించింది.శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థలకు వంద శాతం జల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:తెలంగాణ వాటాఒక్క చుక్క నీటిని కూడ వదులుకోం: వైఎస్ షర్మిల

శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ను ఉత్పత్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ విషయమై కెఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ విషయమై తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణ పనులను ఏపీ చేపట్టడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు ఫిర్యాదు చేసింది.