ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత: జగన్ సర్కార్ నిర్ణయం
ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు కరోనా వ్యాక్సిన్ వేసే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
విజయవాడ: ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు కరోనా వ్యాక్సిన్ వేసే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కరోనా వ్యాక్సినేషన్ నిబంధనల్లో ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నాడు మార్పులు చేసింది. 45 ఏళ్లు లేకున్నా కూడ ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు వ్యాక్సిన్ వేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.
also read:మీ సంకల్పం చాలా గొప్పది..: లేఖ ద్వారా ప్రధానిపై ప్రశంసలు కురిపించిన జగన్
రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లుల జాబితాను తయారు చేసి వ్యాక్సిన్ వేసే విషయంలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆశా వర్కర్తు, ఆరోగ్య కార్యకర్తలు ఈ జాబితాను తయారు చేయనున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు టోకెన్లను ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు అందించనున్నారు. ఈ టోకెన్ల ఆధారంగా వ్యాక్సిన్ అందించనున్నారు.రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్టుగా కేంద్రం సోమవారం నాడు ప్రకటించింది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఉచితంా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు ఇవాళ కొత్త మార్గదర్శకాలను కూడ కేంద్రం విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ నుండి కొత్త గైడ్‌లైన్స్ అమల్లోకి రానున్నాయి.